రాష్ట్ర ప్రభుత్వం జగన్‌తో కుమ్మక్కైంది:యనమల

 

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం జగన్‌తో కుమ్మక్కైందని టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్‌ జైలు నుంచి రాజకీయ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన ఆయన జైలులో ఎవరెవరిని కలుస్తున్నారో బయట పెట్టాలని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడుతూ జైలులో నుండి ఆయన రాజకీయ కార్యకలపాలు కొనసాగిస్తుడని ప్రతి రోజు ఆయన ఎంతో మందిని కలిసి సంప్రదింపులు జరుపుతున్నాడని విమర్శించారు.