రాష్ట్ర విభజన విషయంలో కొత్త సమస్యలు సృష్టించొద్దు :దేవేందర్‌ గౌడ్‌

ఢిల్లీ:  రాష్ట్ర విభజన విషయంలో కొత్త  సమస్యలు సృష్టించొద్దు అన్ని తెదేపా నేత దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. మన రాష్ట్రం అన్ని విషయంలో వెనుకబడిందని, రాష్ట్రంలో  ప్రభుత్వమే లేని పాలన  కొనసాగుతోందని ఆయన  ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత సరిస్థితులకు కాంగ్రెస్‌ పాలనే కారణమని కేంద్రం నుంచి  రావాల్సిన నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దేవేందర్‌ గౌడ్‌ విమర్శించారు. వెనుకబడిన తరగతుల గురించి పట్టించుకున్న నాథుడే లేడన్నారు. బీసీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన  ఆరోపించారు.