‘రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు ముఖ్యం’

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు  కంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ మార్చ్‌ నిర్వహించి తీరుతామని ఆయన హెచ్చరించారు. మిలియన్‌ మార్చ్‌లాగే తెలంగాణ మార్చ్‌ను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు మార్చ్‌కు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. లాఠీలు, తుటాలు ఉద్యమాన్ని ఆపలేవని హెచ్చరించారు.