రాహుల్ గాంధీపై అనర్హత వేటు దుర్మార్గం. – సీనియర్ న్యాయవాది మనోహర్.
ఫొటో :కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం రవీందర్.
బెల్లంపల్లి, మార్చ్ 25, (జనంసాక్షి )
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు దుర్మార్గం అని బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం రవీందర్ అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ
రాహుల్ గాంధీ జోడో యాత్రను ఎదురుకోలేక బిజెపి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని అందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ రాహుల్ గాంధీకి భయపడే తప్పుడు కేసులు పెట్టి అనర్హత వేటు వేశారన్నారు. ఈదుర్మార్గపు చర్యను దేశ ప్రజలందరూ ఖండిచాలన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి దేశ సంపదను అంబానీ, ఆదానికి దోచిపెట్టిన విషయాలను పార్లమెంటులో ఆధారాలతో ప్రశ్నిస్తే, ఆదానీ కోసం, ఆదాని కుంభకోణం విషయాన్ని పక్కదోవ పట్టించాలనే దుర్బుద్ధితో తప్పుడు కేసు లు పెట్టారని అన్నారు. హైకోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ సెక్రటరీ దుర్మార్గమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేశారని అన్నారు. గతంలో ఇలాగే ఇందిరా గాంధీపై కూడా అనర్హత వేటు వేసిన అలహాబాద్ కోర్టులో స్టే తెచ్చుకొని యధాతధంగా కొనసాగినటువంటి చరిత్ర ఉందని, ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో కూడా జరిగేదని, అలాగే జరుగుతుందని భావించి ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారన్నారు. పతనానికి దగ్గర పడ్డ మోడీ పాలనలో దేశం కోసం త్యాగాలు చేసినటువంటి గాంధీ కుటుంబాన్ని సమాజంలో అబాసుపాలు చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, భావసారుప్యత కలిగిన పార్టీలు, మేధావులు ముక్తకంఠంతో ఈ దుశ్చర్యను ఖండిస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా చేయాలనే కుట్రలో భాగమే అనర్హత వేటు అన్నారు. క్షమాపణ కోరడానికి సావర్కర్ కాదని, ఇక్కడ ఉన్నది రాహుల్ గాంధీ అని గుర్తించాలన్నారు.