రాహుల్ గాంధీ గారిపై  అనర్హత వేటు దుర్మార్గం చర్య

*-రాహుల్ గాంధీ గారిపై  అనర్హత వేటు దుర్మార్గం చర్య*- మోడీ పాలనకు ఎమర్జెన్సీ రోజులు తలపిస్తుంది..యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం… భువనగిరి టౌన్ (జనం సాక్షి):—భువనగిరి పట్టణంలో సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిని పార్లమెంటులో అనర్హత రేటు వేయడం నరహంతక నరేంద్ర మోడీ అమిత్ షా నియంతృత్వానికి నిదర్శమని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యానర్ తో నిరసన తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని శ్రీ రాహుల్ గాంధీ గారిపై అనర్హత  వేటు వేయడం దుర్మార్గం చర్య నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎమర్జెన్సీ రోజులు దగ్గర పడుతున్నాయని ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ప్రజా ఆదరణ పొందుతుందని జీర్ణించుకోలేకనే దుర్మార్గ చర్యలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని ఈదేశం కోసం శ్రీమతి ఇందిరా గాంధీ  రాజీవ్ గాంధీ  ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గెసూరత్ కోర్టులో జైలు శిక్ష విధించడం కోర్టును గౌరవిస్తూ బిజెపి ప్రభుత్వానికి క్షమాపణ కోరనని న్యాయస్థానంలో పోరాటం చేస్తానని స్పష్టంగా తెలియజేసిన మహోన్న వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ అని అన్నారు.
పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పడిగెల ప్రదీప్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్ పీసీసీ డేల్ గేట్ తంగళ్ళపల్లి రవికుమార్ చల్లగురుకుల రఘుబాబు సత్యనారాయణ యువజన కాంగ్రెస్ నాయకులు దర్గాయి దేవేందర్ కొండల్ దాసరి మధు బట్టు మహేందర్ శ్రవణ్ అనంతరం ఉపసర్పంచ్ వెంకటేష్ కాల్య నాగరాజు బైశెట్టి రవీందర్ మల్లారెడ్డి అంగడి నాగరాజు కాకునూరి మహేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది.