రిటైర్మెంట్‌పై నేడు లక్ష్మణ్‌ అధికారిక ప్రకటన

హైదరాబాద్‌: హైదరాబాదీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికే విషయంపై నేడు స్పష్టత రానుంది. సాయంత్రం 4 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో లక్ష్మణ్‌ తన రిటైర్మెంట్‌పై అధికారి ప్రకటన చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో సొంత మైదానంలో జరుగుతున్న తొలిటెస్ట్‌ అనంతరం రిటైర్‌ అవుతాడా? లేక సిరీస్‌ అనంతరం రిటైర్‌ అవుతాడా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈనెల 23 కివీస్‌తో తొలిటెస్ట్‌ సందర్భంగా లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. 134 టెస్టులు అడిన లక్ష్మణ్‌ 17 సెంచరీలు, 56 అర సెంచరీలతో 8,781 పరుగులు చేశారు. వన్డేల్లో 86 మ్యాచ్‌లు ఆడి 6 సెంచరీలు, 10 అర్థ సెంచరీలతో 2,338 పరుగులు చేశాడు.