రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌: రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆలహాబాద్‌ బ్యాంకు ఛైర్మన్‌ జె.పి.దువా ప్రకటించారు. ప్రస్తుతం 18శాతానికి ఉన్న వ్యవసాయ రంగం వాటిని భవిష్యత్తులో పెంచుతామని ఆయన హైదరాబాద్‌లో తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 20శాతం వృద్ధితో 3లక్షల 30వేల కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దక్షిణభారత దేశంలో అలహాబాద్‌ బ్యాంకు కార్యకలాపాలకు ఎక్కువగా విస్తరించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 250కొత్త శాఖల్ని ప్రారంభిస్తామని ప్రకటించిన ఆయన 2, 600ల ఉద్యగాల్నీ భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.