రెండో వన్డేలో శ్రీలంక ఘన విజయం
హంబన్‌టోట: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో శ్రీలంక భారత్‌పై 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.5ఓవర్లలో 139/1లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్లు తరంగ (59నాటౌట్), దిల్హాన్(50) మొదటి వికెట్‌కు 119 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో లంక సునాయాసంగా విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-శ్రీలంక బౌలర్లు పెరెరా 3/19 మాధ్యూన్ 3/14 దాటికి 138పరుగులకే ఆలౌటయింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ గౌతం గంభీర్ (65)మాత్రమే రాణించాడు. అశ్విన్(21), సెహ్వాగ్(15) పరుగులు చేశారు. తొలి వన్డేలో సెంచరీతో రాణించిన కోహ్లీ (1) విఫలమయ్యాడు.