రెండో వికెట్ కోల్పోయిన పాక్
అడిలైడ్: పాకిస్థాన్పై భారత బౌలర్లు రాణిస్తున్నారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న షెహజాద్, హారిస్ సొహైల్ జోడీని అశ్విన్ విడదీసి మెయిడిన్ వికెట్ తీశాడు. అశ్విన్ బౌలింగ్లో సొహైల్.. రోహిత్ శర్మకు క్యాచిచ్చాడు. ప్రపంచ కప్ గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో.. 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 19 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.
భారత్ ఆరంభంలోనే పాక్ వికెట్ తీసింది. యువ పేసర్ షమీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూనస్ ఖాన్(6) ను అవుట్ చేశాడు. యూనస్.. ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. షెహజాద్, హారిస్ సొహైల్ క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది.