రెచ్చగొట్టి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు:కొదాండరాం

హైదరాబాద్‌: తెలంగాణ వాదులంత శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అధికారంలో ఉన్నవారు రెచ్చగొట్టి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని జేఏసీ చైర్మన్‌ కోదాండరాం అన్నారు. తెలంగాణ కవాతు శాంతియుతంగా నడిచేలా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణ కవాతును ట్యాంక్‌బాండ్‌పై నిర్వహిస్తామని గవర్నర్‌కు చెప్పామన్నారు. మళ్లీ విగ్రహాలు పెట్టి ఆగ్రహానికి గురికావోద్దని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను దృష్టలో పెట్టుకుని విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.