రెజ్లింగ్‌లో రజితం

 లండన్‌లో మళ్లీ రెపరెపలాడిన త్రివర్ణం
చరిత్ర సృష్టించిన సుశీల్‌ కుమార్‌
భారత్‌ ఖాతాలో ఆరో పతకం
లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌లో ఆఖరిరోజు రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ సంచలనం సృష్టించాడు. సెమీస్‌లో నెగ్గి ఫైనల్‌కు చేరుకు న్నాడు. భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. రెండు వారాల పాటు కొన సాగిన ఒలింపిక్స్‌ ఆదివారం అర్ధరాత్రి ముగియనున్న విషయం.. భారత్‌ రెం డు రజతాలు.. నాలుగు కాంస్యాలు సాధించినట్టయింది. ఫైనల్లో జపాన్‌ రెజ్లర్‌ చేతిలో సుశీల్‌ ఓటమి పాలయ్యాడు.
సుశీల్‌కుమార్‌ పోరు ఇలా..
ఒలింపిక్స్‌ క్రీడల్లో రెజ్లింగ్‌ పోటీలలో భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ ఫైనల్‌లోకి ప్రవేశించారు. సుశీల్‌ కుమార్‌ కజకిస్తాన్‌ రెజ్లర్‌ అజ్‌హురేక్‌పై సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్‌ చేరుకున్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో మెడల్స్‌ సాధించిన భారత ఆటగాడిగా సుశీల్‌ చరిత్ర సృష్టించారు. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా లండన్‌ ఒలింపిక్స్‌లో 66 కిలోల ఫ్రీ స్టైల్‌ రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌ ఉజ్జెకిస్తాన్‌ రెజ్లర్‌ ఇక్తియార్‌పైన క్వార్టర్‌ ఫైనల్లో విజయం సాధించాడు. అంతకుముందు ఫ్రీ క్వార్డర్‌ ఫైనల్లో కూడా టర్కీకి చెందిన రెజ్లర్‌ శాహిన్‌ రమజాన్‌ పైన ఘన విజయమే సాధించాడు.కాగా ఇప్పటికే భారత్‌ తన ఖాతాలో ఐదు పతకాలు వేసుకుంది. సుశీల్‌ కుమార్‌ పతకంతో భారత్‌ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి.