రేగా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 31 (జనం సాక్షి): రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బింగి మురళి కుటుంబ సభ్యులకు రూ.పది వేల ఆర్థిక సహాయాన్ని అందచేశారు బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన బింగి మురళి అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం రేగా కాంతారావుకి తెలుపగా తక్షణమే స్పందించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ పది వేల రూపాయల నగదును వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్టు తరఫున ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించటం, అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమంది కి సహాయ సహకారాలు అందిస్తు సమాజంలోని పేదలను ఆదుకునేందుకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుం దన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.