రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న సునీల్
రెడ్డి జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామం లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లీ విగ్రహ ప్రతిష్టాపన, బోనాల జాతరలో మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. జాతర నిర్వహణకు తన వంతు సహాయంగా రూ. 15, 000 విరాళం అందజేశారు. అనంతరం సునీల్ రెడ్డిని ఆలయ కమిటీ పాలకవర్గం సభ్యులు శాలువాతో సన్మానించారు.