రేపు,ఎల్లుండి గ్రూపు -2 పరీక్ష

హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు కమిషన్‌ కార్యదర్శి పూనం మాల కొండయ్య ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,22 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు 1,360 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. 5,48,336 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని ఆమె వెల్లడించారు. పరీక్ష రాయగోరే అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.ఈ అవకాశం రేపటి వరకు ఉంటుందని స్పష్టం చేశారు.