రేపు ఇంజనీరింగ్‌ కాలేజీల అఫిడవిట్లు దాఖలు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన 35 వేలరూపాయల ఫీజు తమకు సమ్మతమేనని ప్రకటించిన 600 కాలేజీల యాజమాన్యాలు రేపు అఫిడవిట్‌ సమర్పించనున్నాయి. ఏకీకృతఫీజుల అమలుపై సుప్రీంకోర్టులో మొదటినుంచి పోరాడుతున్న సుమారు 40 కాలేజీలు మాత్రం ఇంకా తమ ప్రయత్నాలలోనే ఉన్నాయి. విద్యార్ధులనుంచే మిగిలినవి వసూలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది.