రేపు, ఎల్లుండి బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ముంబయి: దేశంలో రెండు రోజుల పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థ స్తంభించనుంది. బ్యాంకింగ్‌ చట్టాల్లో మార్పులకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా 27 ప్రభుత్వ బ్యాంకులు 12 పాత ప్రైవేటు బ్యాంకులు, ఎనిమిది విదేశీ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, ఆధికారులు బుధవారం నుంచి రెండు రోజులు సమ్మె చేయనున్నారని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి విశ్వాస్‌ ఉతాగి తెలిపారు. చట్టాల్లో మార్పులకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో  ఉంది.బ్యాంకుల విలీనం, బాంకుల్లో ప్రైవేటు, విదేశీ మూలధనాన్ని అనుమతించడం, పరిమితి లేని ఓటింగ్‌ హక్కులు వంటి వాటికి మార్గం సుగమం చేయడానికే ఈ మార్పులు చేస్తున్నారని విశ్వాస్‌ ఆరోపించారు. ప్రైవేటు బ్యాంకింగ్‌ వ్యవస్థను బహుళ జాతి బ్యాంకులకు అప్పగించడానికే ఈ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.