రేపు టాడా కోర్టులో లొంగిపోనున్న సంజయ్‌దత్
ముంబయి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైలులో లొంగిపోతానన్న పిటిషన్‌ను బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఉపసంహరించుకున్నారు. రేపు టాడా కోర్టులో సంజయ్‌దత్ లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని నిన్న సంజయ్‌దత్ పిటిషన్ దాఖలు చేశారు.



