రేపు తెలంగాణ సాహిత్య యుద్ధభేరి సభ
హైదరాబాద్: ఈ నెల 20న (ఆదివారం) హైదరాబాద్ దోమలగూడ ఏవీ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సాహిత్య యుద్ధ భేరి సభ నిర్వహించననున్నట్లు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. శుక్రవారం ఆయన వేదిక ప్రతినిధులు జూపాక సుభద్ర, గోగు శ్యామలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించిన వారు, పది జిల్లాలకు చెందిన ప్రముఖులు యుద్ధ భేరి సభలో కళాలకు, గళాలకు పదును పెడుతారని చెప్పారు.