రేపు వైఎస్‌ఆర్‌సీపీ కీలక సమావేశం

హైదరాబాద్‌: భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ రేపు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో పార్టీ సెంట్రల్‌ కమిటీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.