రేవ్‌పార్టీలో పాల్గొన్న 34 మంది అరెస్టు

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ వద్ద ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో పాల్గొన్న 20 మంది యువకులు, 14 మంది యువతులను అరెస్టు చేసినట్లు డీసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న యువకులను రిమండ్‌కు పంపించనున్నట్లు వివరించారు. రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో విద్యార్థులు, ప్రముఖుల పిల్లలు లేరని, అందరూ వ్యాపార వేత్తలనేనని డీసీపీ స్పష్టం చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన నారాయణరెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో వీరంతా పాల్గొన్నట్లు చెప్పారు.