రేషనలైజేషన్ తరువాత డీఎస్సీ..

హైదరాబాద్ : రేషనలైజేషన్ తరువాత డీఎస్సీ ఉంటుందని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని, ఆన్ లైన్ లో టీచర్ల బదిలీలు ఉంటాయని తెలిపారు. అంతర్ జిల్లాల బదిలీలో కేవలం 19 బదిలీలు మాత్రమే చేశామని, రంగారెడ్డి జిల్లాలో వస్తున్న వార్తలు అవాస్తవాలని కొట్టిపారేశారు.