రైతాంగాన్ని అదుకోవాలి

కడప, జూలై 28 : కరవు పరిస్థితుల వల్ల పంటలు కోల్పొయిన రైతంగాన్ని ప్రభుత్వం వెంటనే అదుకోవాలని ఎపి రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ దారులు ఒకవైపు ప్రకృతి నిరాదరణ వల్ల, మరో వైపు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నష్టపోయారని చెప్పారు. అనేక ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగం ఆత్యహత్యలకు పాల్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల అదుకోవాలని కోరారు. రైతంగానికి సంబంధించి 13 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, వచ్చే నెల 4వ తేదీన కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన శనివారంనాడు తెలిపారు. ఈ ధర్నాకు జిల్లాలోని రైతులు హాజరు కావాలని చెప్పారు.