రైతులకు ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాల్సిందే

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై పోరాడుతున్న తెరాస తమపై ఎన్ని కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదని రైతులకు నిరంతరంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సచివాలయంలో సీఎంను కలసిన తెరాస ఎమ్మెల్యేలు విద్యుత్‌ కోతల కారణంగా పంట నష్టపోయిన రైతుకలు పరిహారం చెల్లించాలని కోరారు. వివిధ జిల్లాలో రైతు సమస్యలపై క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.