రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు కేంద్రమంత్రి బిఎల్ వర్మ
జనం సాక్షి/నెక్కొండ/తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ రైతులను నట్టేట ముంచుతున్నారని కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ అన్నారు. ఆయన సోమవారం నెక్కొండ మండల కేంద్రంలో లోక్ సభ
ప్రవస్ యోజన రైతు సదస్సులో మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని దేశంలో అత్యధిక రైతులు చనిపోయింది సిద్దిపేట జిల్లాలోనెనీ 625 మంది రైతులు చనిపోయారని , ఇది బాధాకరంగా ఉందని అలాగే ధాన్యం కొనుగోలులో నాటకాలు ఆడి రైతులని ఇబ్బందులకు గురిచేసారని వరివేస్తే ఊరే అన్నాడు మళ్ళీ కొనుగోలు చేస్తామంటూ రైతులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశాడని ,అలాగే ఫసల్ బీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మోకాళ్ల అడ్డు పెట్టారని కేంద్రం ఇస్తున్న రైతు సంక్షేమ పథకాలు అమలులో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కేంద్రం ఇస్తున్న గ్రామపంచాయతీ నిధులలో తనే ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నాడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు చెప్పుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. కార్యక్రమంలో నాగారం గ్రామానికి చెందిన కట్టయ్య, రెడ్లవాడ గ్రామానికి చెందిన ఇస్లావత్ బాలు, లు ధరణి వల్ల మా భూములకు పట్టాలు రాకుండా పోయాయని బోరున విలపించారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి రాష్ట్రలో ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యను తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రజా ఆరోగ్య నికి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే ఇక్కడ అమలు కాకుండా కేసీఆర్ చేస్తున్నారని, ధరణి పోర్టల్ తెచ్చి రాష్ట్రంలోని రైతుల గోస పెడుతున్నాడని ఇలాంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమా అని రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని బిజెపిని అధికారంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండేటి శ్రీధర్, రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు హుస్సేన్ నాయక్, సంతోష్ నాయక్ ,నెక్కొండ మాజీ ఎంపీపీ ఘటిక అజయ్ కుమార్, మహబూబాబాద్ జిల్లా బిజెపి ఐటి సెల్ ఇంచార్జి శ్రీరంగం సాగర్, యువ మోర్చా రాష్ట్ర నాయకుడు నెల్లికుదురు ఎంపీటీసీ మదన్ , భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సింగారపు సురేష్, సీనియర్ నాయకులు శ్రీరంగం శ్రీనివాస్, అంబాల రామ్ గోపాల్, తాళ్లూరి లక్ష్మయ్య, అనిల్ నాయక్, మూసిన మాధవ్, గోపగాని శ్రీకాంత్, సురేష్ ,శీలం వెంకన్న, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి సంజీవరెడ్డి ,నర్సంపేట ఆర్డిఓ పవన్ కుమార్, నెక్కొండ డిప్యూటీ తాసిల్దార్ రాజకుమార్,
అప్పలరావుపేట రేషన్ షాపును సందర్శించిన కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ రేషన్ షాప్ డీలర్ గ్రామస్తులతో బియ్యం పంపిణీ ఎలా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 15 కేజీలు ఇస్తున్నారని ప్రజలకు వివరించారు.