రైల్వేస్టేషన్లలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

సికింద్రాబాద్‌: రాష్ట్రంలో నీలం తుఫాను కారణంగా కురుస్తున్న బారీ వర్షాలతో  రైళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోతునాయి.దీంతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రయాణికుల సౌకర్యార్ధం పలు రైల్వేస్టేషన్లలో దక్షిణమద్య రైల్వే కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఫోన్‌ నం.040-27786170, 27786140, 27700868, హైదరాబాద్‌ స్టేషన్‌లో 040-23200865,వరంగల్‌ జిల్లా ఖాజీపేట స్టేషన్‌లో 0870-2576430, 2576430,2548660, ఖమ్మం స్టేషన్‌లో 08742-224541 ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంటాయని రైల్వే అదికారులు తెలిపారు.