రైల్వే స్టేషన్లలో చిల్లర నాణేల యంత్రాలు

హైదరాబాద్‌:రైల్వే టిక్కెట్లను కొనడానికి వెళ్లినపుడు చిల్లర లేకుంటే కౌంటర్ల దగ్గర నరకయాతనే.ఈ యాతనకు రైల్వే బోర్డు తెరిదించింది.ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ చిలర్లను సమకూర్చే ఏటిఎం యంత్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.కౌంటర్ల దగ్గర చిల్లర సమస్యపై కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రైల్వే బోర్డు ప్రతినిదులు చర్చించారు.జాతీయ బ్యాంకులతో చెప్పి రైల్వే స్టేషన్లలో చిల్లర యంత్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ ముందు కొచ్చింది,ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు అన్ని జోన్ల అదికారులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది.