రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: భారీ వర్షాలతో రైల్వేలైను దెబ్బతినడం మూలంగా పలుచోట్ల నిలిచిపోయిన రైళ్లను అధికారులు దారి మళ్లిస్తున్నారు. చీరాల వద్ద ఉన్న  అలెప్పిధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ వద్ద నిలిచిపోయిన నాందేడ్‌-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, నిడదవోలు వద్ద ఉన్న యశ్వంత్‌పూర్‌-హతియా ఎక్స్‌ప్రెస్‌లను నాగపూర్‌, బిలాన్‌పూర్‌, టాటానగర్‌ల మీదుగా దారిమళ్లించి నడుపుతున్నారు.