రైళ్ల రాకపోకల్లో మార్పులు
హైదరాబాద్: హైదరాబాద్ రైల్వే స్టేషన్ మరమ్మతుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటినుంచి డిసెంబర్ 13 వరకు హైదరాబాద్‌నుంచి బయలుదేరే నర్సాపూర్, చెన్నై ఎక్స్‌ప్రెస్, నాందేడ్ ప్యాసింజర్, శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్‌నుంచి నడుస్తాయి. లింగంపల్లి- హైదరాబాద్ మధ్య నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- తాండూరు ప్యాసింజర్ రైళ్లు రేపటినుంచి 20 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.



