రోడ్డుపై మహిళ ప్రసవం

హైదరాబాద్ : నారాయణగూడలోని శాంతి థియేటర్ వద్ద రోడ్డుపై మహిళ ప్రసవించింది. ప్రసవించిన మహిళను పోలీసులు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. బాలింతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మహిళ అనాథ అని పోలీసులు భావిస్తున్నారు.