రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

పాకాల: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్ర వ్యాను మొదట టాటా ఇండికా కారును అనంతరం స్కార్పియోను ఢీకొంది. ఈ ఘటనలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంగా రైల్యేకోడూరుకు చెందినవారిగా భావిస్తున్నారు.