రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కంకిపాడు రూరల్‌: పునాదిపాడు వద్ద ఆర్టీసి బస్సు, ఆటో ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ తండ్రీ కొడుకులు. వీళ్లంతా తోట్లవల్లూరు మండలం పెనుమకూరుకు చెందినవారు. బందువుల ఇంటికి గన్నవరం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.