రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
దోమ సెప్టెంబర్ 21 (జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం దోమ ప్రభుత్వ కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న తరుణంలో రోడ్డు మార్గంలో నడుస్తున్న గ్రామానికి చెందిన విద్యార్థినిలు నడుస్తుండగా అతివేగంగా వస్తున్న మోత్కూర్ మెకానిక్ అక్బర్ కుమారుడు సోయల్ ఖాన్ మరియు పరిగి కి చెందిన యువకుల బైకులు ఢీ కొట్టడంతో పక్కనే ఉన్న విద్యార్థినుల పైకి దూసుకెళ్లిన ఈ ఘటనలో ముగ్గురు అమ్మాయిలకు గాయపడగా కామరపు నందిని తండ్రి అంజిలయ్య కు తలకు బలమైన గాయం తగలడం వలన ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది మెరుగైన వైద్యం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయగ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి 11: 50 నిమిషాలకు చెందడం మృతి చెందడం జరిగింది ఇట్టి విషయంపై తండ్రి కామర అంజిలయ్య పిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని దోమ ఎస్ఐ తెలిపారు.