రోడ్లు, భవనాలశాఖపై అంచనాల కమిటీసమీక్ష

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాలులో రోడ్లు,భవనాల శాఖపై అంచనాల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లకు రావాల్సిన కేంద్ర నిధులు ఆగిపోవటంపై త్వరలో ఢిల్లీ వెళ్లాలని అంచనాల కమిటీ నిర్ణయించింది. ట్యాంక్‌బండ్‌, దుబ్బాకలోని సౌరవిద్యుత్‌ పని తీరును కమిటీ పరిశీలించనుంది. ఈ సందర్భంగా రాజీవ్‌ రహదారి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు.