ర్యాగింగ్‌ చేసిన సీనియర్లను శిక్షించాలని ఫిర్యాదు

హైదరాబాద్‌: వరంగల్‌లోని ఎస్‌ఐటిలో జూనియర్‌ విద్యార్థుల్ని ర్యాగింగ్‌ చేసిన సీనియర్లను శిక్షించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్‌ అక్టోబర్‌ 10లోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.