లండన్ ఒలింపిక్స్ : భారత మహిళల ఆర్చరీ ఓటమి
న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి) గత శుక్రవారం నుంచి ప్రారంభమైన లండన్ ఒలింపిక్స్ పోటీల్లో భారత ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శన తో రాణిస్తున్నారు.ఇప్పటికే ,రైఫిల్స్,బ్యాడ్మింటన్‌లలో పూర్తి నిరాశ పరిచిన భారత ఆటగాళ్లు ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ విఫలమయ్యారు.లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన టీమ్ ఈవెంట్ ప్రీక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో భారత టీమ్ ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది.దీపికా కుమారి,బోంబేలా దేవి,సువురో చక్రవోలులతో కూడిన భారత టీమ్ 210 పాయింట్లు సాధించగా డెన్మార్క్ ఆర్చర్లు 211 పాయింట్లు గెల్చుకున్నారు.