లక్ష్మణ్‌ బాపూజీకి జైపాల్‌రెడ్డి నివాళి

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ భౌతికకాయానికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, అయితే బాపూజీ  అంత్యక్రియలు జలదృశ్యంలో నిర్వహించాలని జైపాల్‌రెడ్డిని తెలంగాణవాదులు కాసేపు అడ్డుకున్నారు.