లక్ష్మింపేట దళితుల సమస్యలు పరిష్కరించాలి

విజయనగరం, ఆగస్టు 3 : శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట దళితుల సమస్యలను ప్రభుత్వమే తక్షణమే పరిష్కరించాలని జిల్లా సామాజిక న్యాయ ఉద్యమ వేదిక కన్వీనర్‌ గంటాన అప్పారావు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణ పేరుతో కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో పూర్తిస్థాయి న్యాయం జరగడానికి దళితులంతా ఏకమవ్వాలన్నారు. లక్ష్మింపేట దళితులు హక్కుల సాధనకు ఈ నెల 22న చేపట్టే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.