లక్ష్మీంపెట ఘటన నిందితులపై రివార్డు

శ్రీకాకుళం:వంగర మండల లక్ష్మీపెటలో మరణకాండ ఘటనలో ప్రధాన నిందితులైన బొత్స వాసుదేవనాయుడు,ఆవుల శ్రీనివాసరావుల అచూకీ తెలిస్తే వెంటనే సమచారమందించాలని సీబీసీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ప్రభాకర్‌ రెడ్డి కోరారు.వీరిద్దరి ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొపున రివార్డును అందజేసామని ప్రకటించారు.మంగళవారం వరకూ ఈ ఘటనలో 54 మంది అరెస్టు చేశామని,బుధవారం 10 మందిని అరెస్టు చేశామని తెలిపారు.ప్రదాన నిందితుల ఆచూకీ కోసం ఇతర రాష్ట్రాలకు టీంలను పంపినట్లు ఆయన వ్యక్తం చేశారు.