లక్ష్మీపేట ఘటన ప్రభుత్వ వైఫల్యమే : చంద్రబాబు

రాజాం గ్రామీణం, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే లక్ష్మీపేట ఘటనలో ఐదుగురి వూచకోతకు కారణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరోపించారు. ఈ ఘటనలో గాయపడి విశాఖ కేజీహెచ్‌ చికిత్స పొందుతూ మరణించిన పాపయ్య కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. బాధితులను వెంటనే ప్రభుత్వం అదురోవాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడి ఘటనపై అసెంబ్లీలో ప్రస్తావించి బాధితులకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నస్తామని ఈ సంధర్భంగా ఆయన హమీ ఇచ్చారు. అనంతరం వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. బాధిత కుటుంబాలను పరమర్శించారు.