లగడపాటి నివాసం వద్ద పోలీసు బందోబస్తూ

విజయవాడ: విజయవాడలోని దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తేదేపా అధినేత చంద్రబాబు చేపట్టే మహాధర్నాకు పోటీగా ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ధర్నా చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొగల్‌ రాజ్‌పురంలోని లగడపాటి నివాసం వద్ద పోలీసులు మఫ్టిలో బందోబస్తూ నిర్వహిస్తున్నారు. సోమవారం లగడపాటి పోలీసులు గృహ నిర్భందం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.