లగడపాటి సీమాంధ్రులను రెచ్చగొడుతున్నడు: వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సీమాంధ్ర ప్రజలను రెచ్చగోడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారుగాని, ప్రత్యేక రాష్ట్రంలో సీమాంథ్రులం బతకలేమని ఆయన భయపెడుతున్నారని, సీమాంధ్ర పౌరులను, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో లగడపాటి కుటుంబ సభ్యుల జోలికి  పోలేదని వినోద్‌కుమార్‌ తెలిపారు. లగడపాటి వ్యాపార ప్రయోజనాల కోసమే హైదరాబాద్‌ను అంటిపెట్టుకుని ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణపై విషం గక్కుతున్నారని ఆరోపించారు. ఈనాటి పరిస్థితులను ఆయన సరిగా అర్థం చేసుకోకుండా వక్రీవరిస్తున్నారని వినోద్‌ అన్నారు.

లగడపాటి వకాల్తా పుచ్చుకున్నరు. :వినోద్‌

కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్సీపీల తరపున కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వకాల్తా పుచ్చుకున్నారని వినోద్‌కుమార్‌ ఆరోపించారు. ఈమూడు పార్టీలకు దమ్ముంటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణలో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెబితే తెలంగాణలో రెండు శాతం ఓట్లు కూడా రావని ఆయన చెప్పారు.