లస్మన్నపల్లి అంగన్వాడీలో ముందస్తు ఉగాది వేడుకలు


*****
సైదాపూర్: జనం సాక్షి మార్చి21’మండలంలోని లస్మన్నపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో మంగళవారం ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ.
శోభా కృత నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని పచ్చడిలో తీపి ,చేదు, పులుపు వంటి రుచుల మాదిరిగానే మంచి చెడులను ఆస్వాదించాలని చెడు పరిస్థితిలను దాటి అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. ఈ సందర్భంగా పచ్చడి తాగి బచ్చాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కవిత, అంగన్వాడి టీచర్ స్వరాజ్యం, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, బాలింతలు, గర్భవతులు, పాల్గొన్నారు.