లాభాలలో సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 61.18 పాయింట్ల అధిక్యంతో 16967.76 వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 21.10 పాయింట్ల లాభంతో 5141.90 ముగిశాయి. టాటా స్టీల్‌, టాటా పవర్‌, స్టెరిలైట్‌ ఇండస్ట్రీన్‌, సన్‌ఫార్మా, హిందాల్కో షేర్లకు లాభాలు లభించాయి. రూపాయి క్షీణత పై ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్న వార్తలు మార్కెట్‌ లాభాల్లోకి వెళ్లేందుకు దోహదం చేశాయి.