లాభాల్లో వాటాలపై బీసీసీఐని కోరుతున్న పిసిబీ

లాహోర్‌, జూలై 18 : చిరకాల ప్రత్యర్థి భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు పునరుద్ధరణ కావడంతో పాకిసాన్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పుడు రెవెన్యూ పై దృష్టి పెట్టింది. భారత్‌ తో ఆడే మూడు వన్డేలు, రెండు టీ ట్వంటీలకు సంబంధించి వచ్చే లాభాలలో  వాటా కోరాలని పిసీబి భావిస్తోంది. దీనిపై బీసీసీఐ తో త్వరలోనే చర్చలు జరపనున్నట్టు బోర్డు తెలిపింది. పాక్‌ కోరాలని పిసీబీ భావిస్తొంది. దీనిపై బీసీసీఐతో త్వరలోనే చర్చలు జరపనున్నట్టు బోర్డు తెలిపింది. పాక్‌ క్రికెట్‌ బోర్డు చాలా కాలంగా ఆర్ధికపరమైన నష్టాల్లో ఉంది. 2009 లో శ్రీలంక క్రికెట్‌ జట్టు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఏ దేశమూ అక్కడ పర్యటించేందుకు అంగీకరించులేదు. దీంతో ప్రపంచకప్‌ మ్యాచ్‌ల అతిథ్యంతో పాటు పలు సిరీస్‌ల నిర్వహణను పాకిస్థాన్‌ కోల్పోయింది. అబుదాబీరి తటస్ధ వేదికగా మార్చుకుని సిరీస్‌లు ఆడుతోంది. అప్పటి నుండి ఆర్ధిక పరంగా దెబ్బతిన్న పిసీబీ మళ్ళీ గాడినపడేందుకు మధ్య అంగీకారం కుదరడంతో వచ్చే డిసెంబరు లో వన్డే , టీ ట్వంటీ సిరీస్‌ ఆడునున్నాయి. 2007 ముంబై దాడుల తర్వాత భారత్‌ -పాక్‌ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుండీ కేవలం తటస్థ వేదికలో తప్పించి నేరుగా మ్యాచ్‌లే ఆడడం లేదు. ప్రసుత్తం సంబంధాలు మెరుగుపడుతుండడంతో పిసీబీ సంతోషంతో ఉంది. డిసెంబరు , జనవరి లో భారత పర్యటనకు తమ జట్టును పంపించనుంది. ఈ సిరీస్‌ ఖరారు కాకముందు పిసీబీ మూడు ప్రతిపాదనలు చేసింది. దీనిలో ఒకటి భారత్‌లో రెండు స్టేడియాలు అద్దెకు ఇస్తే వాటిని హోం గ్రౌండ్‌ గా వాడుకుని మ్యాచ్‌లు ప్రతిపాదించింది. తాజాగా వన్డే సిరీస్‌ కు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇప్పుడు తో ఇప్పుడు లాభాల్లో వాటా ఆడింగేందుకు సిద్దమైంది. భారత్‌ తో సంబంధాలు తాము పుంజుకునేందుకు అవకాశం దొరికిందని పిసీబీ పెద్దలతో మాట్లాడేందుకు ముంబై వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.