లారీని ఢీకొన్న కారు

శ్రీకాకుళం:జిల్లాలో ఈరోజు జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం దేవాది వద్ద ఈ దుర్ఘటన జరిగింది.రోడ్డుపక్క ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టటంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్చారు.వారి పరిస్థితి విషయంగా ఉంది.