లారీని ఢీకొన్న బైక్‌: నవదంపతుల మృతి

యాదాద్రి భువనగిరి,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లాలోని భువనగిరి మండలం కుమ్మరిగూడెం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్నది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు భువనగిరి మండలం కేసారం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను  స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

తాజావార్తలు