లారీ అసోసియేషన్ ఆవరణలో కొలువుదిరిన గణనాథుడు

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
కోదాడ టౌన్ ఆగస్టు 31 ( జనంసాక్షి )
విగ్నేశ్వరుడి కరుణాకటాక్షంతో విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.బుధవారం పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహం వద్ద కోదాడ లారీ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు దంపతులు పీటల మీద కూర్చొని విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలందరికీ విఘ్నాలు తొలగి విజయాలు కలగాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రైతులకు పాడి పంటలతో సస్యశ్యామలం కావాలని విగ్నేశ్వరుని పూజించినట్లు తెలిపారు.అనంతరం అసోసియేషన్ ఆవరణలో స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంతో సంతోషాలతో నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో
 కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు,తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు,ఉమ్మడి నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావు,జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ,తునం కృష్ణ, విలాస కవి నరసరాజు,గుండపునేని నాగేశ్వరరావు,పెద్ది అంజయ్య,కొండలరావు,దొంగరి శ్రీను,గౌస్ తదితరులు పాల్గొన్నారు.