లారీ వెనుక లారీ చెడిపోతున్న రహదారి

 

 

 

 

 

 

 

పోలీసు రెవెన్యూ శాఖ మధ్య సమన్వయ లోపం
బిచ్కుంద మార్చి (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో గల ఖత్గావ్, షెట్లుర్, హజ్గుల్, పుల్కల్ వాజిద్నగర్ మీదుగా మంజీరా వాగులోంచి అక్రమ ఇసుక అధికారుల కనుసందుల్లోనే జీరో దందా నడుస్తున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్రంలో కొన్ని చోట్ల రోడ్లు బాగు పడ్డాయంటే ఈ అక్రమ ఇసుక రవాణా వల్ల రోడ్లు గుంతలమయమవున్నాయి. ఇక సామాన్యునికి అందాలంటే కష్టంగా మారింది. ఇది ఇలా ఉంటే కాసులకు కక్కుర్తి పడి అధికారులు తహశీల్దారు నుంచి కామ్దార్ వరకు, సీఐ నుంచి హోంగార్డు వరకు, అధికారపక్షం, ప్రతిపక్షం అని తేడా లేకుండా వారి నిర్వాహకుల చేతివాటం కాసులు కురిపించడంతో ఇసుక దళారులు ఇంకా ఆడింది ఆట పాడింది పాటగా తయారయింది. గత కొంతకాలంగా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని ప్రభుత్వ దృష్టికి చేరడంతో గత 10 నెలలుగా క్వారీ ని మూసివేశారు. మళ్లీ అధికార పక్ష నేతలను కలిసి ఒప్పించి ముట్టజెప్పి ప్రస్తుతానికి రెండవ నంబర్ క్వారీ నడుస్తుంది. ఇంతకుముందు దొంగ చాటున నడుస్తున్న పట్టించుకోని అధికారులు ఇప్పుడు దర్జాగా పట్టపగలే జీరో దండం ప్రోత్సహిస్తూ ప్రభుత్వ సొమ్మును కోట్ల రూపాయలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుక ఇంత అక్రమ రవాణా జరిగిన అడిగేవారు లేకపోయారు. ప్రతిపక్ష నాయకులను కలుపుకొని జీరో దందా నడిపిస్తున్న అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాతో కలిసి ప్రభుత్వ సొమ్మును గండి కొడుతున్న చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయింది. దీంతో ఇసుక మాఫియాకు మూడు పువ్వులు ఆరు కాయలుగా కాసుల పంటను కురిపిస్తున్న మంజీరా వాగులోని ఇసుక సామాన్యుడు కొనాలంటే భయమేస్తుంది. ఒకప్పుడు బంగారం అంటేనే భయపడే సామాన్య ప్రజలు. ఇప్పుడు ఇసుకను కూడా కొనలేని స్థితిగా దిగజార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము అని జనం లోలోపల అనుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.