లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మహంకాళి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. పాతబస్తీలోని మొత్తం 11 ప్రధాన ఆలయాలు ఈ ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహకులు తెలియజేశారు.