లీజుకిచ్చిన 93 గనులకు పర్యావరణ అనుమతులను రద్దు చేసింది
ఢిల్లీ: కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గోవా రాష్ట్రంలో లీజుకిచ్చిన 93 గనులకు పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. గనుల యాజమానులను సరైన పత్రాలు సమర్పించాల్సిందిగా సూచించింది. సరైన ఆధారాలు లేకుండానే ఈ గనులకు అనుమతులు మంజూరు చేసినట్లు షా కమిషన్ నివేదిక పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.